ఐటీ ఉద్యోగులు పొరపాటున కూడా ఇలా చేయొద్దు.. జాబ్ నుంచి పీకేస్తారు.. మెటాలో 20 మందిని ఇంటికి పంపించేశారు..!

ఐటీ ఉద్యోగులు పొరపాటున కూడా ఇలా చేయొద్దు.. జాబ్ నుంచి పీకేస్తారు.. మెటాలో 20 మందిని ఇంటికి పంపించేశారు..!

ప్రముఖ టెక్ కంపెనీ మెటా డేటా లీక్ చేశారనే కారణంగా 20 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేసింది. మెటా కంపెనీ అంతర్గత సమాచారంతో పాటు ప్రాజెక్ట్ ప్లాన్స్ ను ఈ 20 మంది ఉద్యోగులు లీక్ చేశారని, ఈ కారణంగానే వారిని ఉద్యోగాల నుంచి తొలగించామని మెటా ప్రతినిధి డేవ్ ఆర్ల్నాడ్స్ తెలిపారు. మెటాలో ఉద్యోగులు జాయిన్ అయ్యే సమయంలోనే కంపెనీ అంతర్గత సమాచారాన్ని బయటపెట్టడం కంపెనీ పాలసీకి విరుద్ధమని ఉద్యోగులకు స్పష్టం చేశామని గుర్తుచేశారు.

అలా డేటాను లీక్ చేస్తే ఉద్యోగం నుంచి ఉన్నపళంగా తొలగించి కఠిన చర్యలు తీసుకుంటామని ముందే వెల్లడించామని తెలిపారు. గత కొన్ని నెలల నుంచి మెటా సంస్థలో ఈ డేటా లీక్ కల్లోలం రేపింది. తాను చెప్పిన ప్రతీ విషయం లీక్ అయి బయటకు వెళ్లిపోతుందని మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు.

ALSO READ : ఉద్యోగుల కొంప ముంచిన ఏఐ.. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో 1,350 మంది ఉద్యోగాలు ఫట్..!

మెటా సంస్థ అంతర్గత సమావేశాల్లో కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్ ప్లాన్స్ డిస్కస్ చేస్తుంటారు. ఈ ప్రొడక్ట్ ప్లాన్స్ గురించి కూడా కంపెనీలో కొందరు ఉద్యోగులు డేటాను లీక్ చేస్తున్నారని భావించిన మెటా సంస్థ నిఘా పెట్టింది. ఈ నిఘాలోనే 20 మంది ఉద్యోగులు అడ్డంగా దొరికిపోయారు. మెటా సంస్థలో ఇంకా డేటా లీక్ వీరులు ఉన్నారని ఆ సంస్థ భావిస్తోంది. ఈ విషయాన్ని తాము చాలా సీరియస్గా తీసుకున్నామని, లీక్ చేస్తున్నట్లు తేలితే మాత్రం ఉద్యోగం నుంచి పీకేసి కఠిన చర్యలు తీసుకుంటామని మెటా సంస్థ ఉద్యోగులను హెచ్చరించింది.