తప్పయింది.. సారీ: కేంద్ర ప్రభుత్వానికి మెటా క్షమాపణలు

తప్పయింది.. సారీ: కేంద్ర ప్రభుత్వానికి మెటా క్షమాపణలు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి మెటా ఇండియా క్షమాపణలు చెప్పింది. ఇటీవలి లోక్‌‌సభ ఎన్నికలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మెటాపై కేంద్రం సీరియస్‌‌ అయింది. 2024 ఎన్నికల్లో ఇండియాలో అప్పటివరకు అధికారంలో ఉన్న ప్రభుత్వం తన అధికారాన్ని కోల్పోయిందంటూ మెటా చీఫ్​ జుకర్‌‌‌‌ బర్గ్‌‌ వ్యాఖ్యానించారు. 

ఈ కామెంట్లపై వివరణ ఇవ్వాలంటూ కంపెనీ అధికారులను పిలిపిస్తామని పార్లమెంటరీ ప్యానెల్ ఐటీ హెడ్‌‌, బీజేపీ ఎంపీ నిషికాంత్‌‌ దూబే హెచ్చరించారు. దీంతో దిగొచ్చిన మెటా ఇండియా వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ శివ్‌‌నాథ్‌‌ తుక్రాల్‌‌ బుధవారం ట్విట్టర్‌‌‌‌లో క్షమాపణలు చెప్పారు. అనుకోకుండా జరిగిన పొరపాటు అని వివరణ ఇచ్చారు. దీంతో మెటా ఇండియా క్షమాపణ చెప్పిందని, ఈ విజయం దేశంలోని సామాన్య పౌరులకు చెందుతుందని దూబే ట్వీట్‌‌ చేశారు.