![Meta layoffs: ఉద్యోగులకు మెటా షాక్..3వేల మంది తొలగింపుకు రంగం సిద్దం!](https://static.v6velugu.com/uploads/2025/02/meta-layoffs-over-3000-meta-employees-to-lose-jobs-on-monday-leaked-memo-reveals_yGb3wiD6Q9.jpg)
వాట్సాప్, ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా ఉద్యోగులను తొలగిస్తున్న ప్రకటిచింది.దాదాపు 3వేల ఉద్యోగాలను తొలగిస్తోంది. మెటా వర్క్ ఫోర్స్ లో ఇది 5శాతం ఉం టుంది. శుక్రవారం (ఫిబ్రవరి7) విడుదల చేసిన అంతర్గత మెమో ద్వారా ఉద్యోగులకు సమాచారం అందించబడింది. ఉద్యోగులకు మెటా ఇచ్చి మెమో లీక్ అయింది.
మెటా హ్యూమన్ రీసోర్స్ వైప్ ప్రెసిడెంట్ జాన్ ల్లే గేల్.. కంపెనీ ఇంటర్నల్ వర్క్ ప్లేస్ ఫోరమ్ లో ఈ తొలగింపుల మెమోను పోస్ట్ చేశారు. ఉద్యోగాలు కోల్పోతున్న ఉద్యోగులకు సోమవారం(ఫిబ్రవరి10) ఉదయం ఇమెయిల్ వస్తుందని అందులో పేర్కొంది.
ALSO READ | వాట్సాప్‌లో కరెంట్ బిల్ ఇలా కట్టేయొచ్చు..!
మెటా హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను అనుసరిస్తుంది. దీని ప్రకారం ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసులో ఉండాలి. అయితే సోమవారం ఇంటి నుంచి పని చేయడం ఇప్పటికీ వ్యక్తిగత సమయంగా లెక్కించబడుతుంది. ఎవరిని తొలగించారో మెటా బహిరంగంగా వెల్లడించదని కూడా మెమోలో పేర్కొన్నారు. తొలగించిన వారి స్థానాల్లోకొత్త వారిని రిక్రూట్ చేయబడుతుందని స్పష్టం చేశారు.