Video Editing App : ఎడిట్స్ యాప్​లో ఫీచర్లు ఇవే

Video Editing App : ఎడిట్స్ యాప్​లో ఫీచర్లు ఇవే

ఎప్పటికప్పుడు ట్రెండింగ్​లో ఉండాలంటే రీల్స్, షార్ట్స్ చేస్తుంటారు చాలామంది. అయితే స్మార్ట్​ఫోన్లలో తీసే వీడియోలు ఇన్​స్టాగ్రామ్​, యూట్యూబ్​లలో అప్​లోడ్ చేయాలంటే వాటిని ఎడిట్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం ఎడిటింగ్ కోసం కొన్ని యాప్​లు వాడుతుంటారు. అయితే వీడియో ఎడిటింగ్​ కోసం మెటా సరికొత్త యాప్​ తీసుకొచ్చింది. దానిపేరే ఎడిట్స్. ఈ యాప్​ కేవలం ఎడిటింగ్​కే కాదు.. క్రియేటర్లకు క్రియేటివ్​ సూట్​ లాంటిది అన్నారు ఇన్​స్టాగ్రామ్​ హెడ్ ఆడమ్​ మెస్సెరి. 

ఇంతకీ ఇందులో ఫీచర్లు ఏంటంటే.. క్రియేటర్లు ఐడియాలను సేవ్​ చేసుకోవడానికి ఈ యాప్​లోనే ఒక ట్యాబ్ ఉంటుంది. అలాగే మంచి క్వాలిటీ వీడియోలు రికార్డ్​ చేసుకునే కెమెరా సెట్టింగ్స్ అందుబాటులో ఉంటాయి. దాంతోపాటు అడ్వాన్స్డ్​ ఎడిటింగ్ టూల్స్ కూడా ఉంటాయి. క్రియేటర్లు, ఫ్రెండ్స్ తమ డ్రాఫ్ట్​లను ఒకదానితో ఒకటి షేర్ చేసుకోవచ్చు. ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేసిన వీడియోలు ఎలా ప్లే అవుతున్నాయో తెలసుకోవడానికి పర్ఫార్మెన్స్ ఇన్​సైట్ టూల్స్ ఉన్నాయి. వాటర్​ మార్క్ లేకుండా వీడియోలు ఎక్స్​పోర్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ యాప్​ యాపిల్​ ఐఫోన్​లలో అందుబాటులో ఉంది. త్వరలోనే ఆండ్రాయిడ్ ఫోన్​లలో కూడా రాబోతుంది. ఈ యాప్​ పూర్తిగా ఉచితం.