ప్రస్తుతం అందరూ సోషల్ మీడియా యుగంలో ఉన్నారు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ అంటూ ప్రపంచంలో ఏమూలన ఏం జరిగినా క్షణంలో అరచేతిలో ప్రత్యక్షమవుతోంది. అయితే.. వీటిల్లో ఇటీవల బాగా ప్రాచుర్యం పొందింది ఇన్ స్టా రీల్స్. దీనికి యువత బాగా కనెక్ట్ అయ్యింది. కొంతమంది తమ టాలెంట్ నిరూపించుకోవడానికి దీనిని వినియోగిస్తుండగా.. కొందరు సమాచారాన్ని చేరవేయడానికి, మరికొందరు ఎంటర్ టైన్ మెంట్ కోసం రీల్స్ చేస్తుంటారు. ఎంత మొత్తంలో రీల్స్ చేస్తున్నారో.. అదే విధంగా ఇన్ స్టా వినియోగదారులు వాటిని చూసి కామెట్లు, లైక్లు ఇస్తున్నారు.
రీల్స్ ని చూసి ఎంజాయ్ చేస్తూ కామెంట్లు, లైక్ ఇచ్చే వారు.. వాటిని డౌన్ లోడ్ చేయడం మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. అలాంటప్పుడు చాలా మంది గూగుల్ ప్లే స్టోర్ నుంచి థర్డ్ పార్టీ యాప్స్ డౌన్ లోడ్ చేసుకొని వాటి ద్వారా ఇన్ స్టా రీల్స్ డౌన్ లోడ్ చేస్తున్నారు. ఇక నుంచి అలాంటి అవసరం లేదు.
ఇకపై ఇన్ స్టాగ్రామ్ వాడుతున్న వాళ్లు ఎంచక్కా రీల్స్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. సంస్థ CEO ఆడమ్ మోస్సేరి ఇదే విషయాన్ని వెల్లడించారు.
మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ మరో అదిరిపోయే ఫీచర్‌ను పరిచయం చేసింది. రీల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి వినియోగదారులను అనుమతించే కొత్త ఆప్షన్‌ను కంపెనీ విడుదల చేయడం ప్రారంభించింది. ఈ ఫీచర్ కోసం చాలా మంది యూజర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు.
అధికారికంగా రీల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ లేకపోవడంతో యూజర్లు థర్డ్ పార్టీ యాప్‌ల సహాయంతో రీల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకునేవారు. నేరుగా ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లోనే రీల్స్ డౌన్‌లోడ్ ఆప్షన్ ఇవ్వాలని చాలా మంది కంపెనీని అభ్యర్థించారు. దీనికి సంబంధించి తాజాగా కంపెనీ హెడ్ ఆడమ్ మోస్సేరి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు. ఇకమీదట రీల్స్‌ను నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, అయితే, పబ్లిక్ ఖాతాల ద్వారా పోస్ట్ చేయబడిన రీల్స్ మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ప్రస్తుతానికి ఈ ఫీచర్ అమెరికాలో ఉన్న వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎలాంటి లింక్‌ను కాపీ చేయాల్సిన అవసరం లేకుండా డౌన్‌లోడ్ చేసిన వీడియోలను నేరుగా వాట్సాప్, ఇతర సోషల్ మీడియా యాప్‌లలో షేర్ చేయవచ్చు. ఇంతకుముందు రీల్స్ షేరింగ్ చేయాలంటే ఆ క్లిప్ లింక్‌ను కాపీ చేసి షేర్ చేయాల్సి వచ్చేది.