రేబాన్ మెటా స్మార్ట్ గ్లాసెస్ అంటే ఓ బ్రాండ్.. ఈ స్మార్ట్ గ్లాసెస్ లో ఫీచర్లు మంచి ప్రజాదరణ పొందాయి. స్మార్ట్ గ్లాస్ ప్రపంచంలో పోటీలేని రారాజుగా రేబాన్ మెటా గ్లాస్ ఉండేది..అయితే ఇప్పుడు సామ్ సంగ్, గూగుల్ వంటి కంపెనీలు లేటెస్ట్ AI పవర్డ్ ఫీచర్లతో స్మార్ట్ గ్లాసెస్ ను విడుదల చేయాలనికి ముందుకొస్తున్నాయి. దీంతో పెరుగుతున్న పోటీని దృష్టిలో ఉంచుకుని Meta RayBan తన ప్రాడక్టులో కొత్త ఫీచర్లను పరిచయం చేయబోతోంది. Meta తన స్మార్ట్ గ్లాసెస్‌కు డిస్ ప్లేలను జోడిస్తోంది.
రేబాన్ మెటా స్మార్ట్ గ్లాసెస్..వర్చువల్ డిస్ ప్లేలో గతంలో ఉన్న రేబాన్ మెటా స్మార్ట్ గ్లాసెస్ లో కంటే మంచి ఫీచర్లు ఉంటాయని కంపెనీ చెపుతోంది. ఈ కొత్త మోడల్ తో వర్చువల్ డిస్ ప్లే ద్వారా స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్ లకు కనెక్ట్ అవ్వొచ్చు. మేసేజ్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. దీనిలో మరో ప్రత్యేకత ఏంటంటే.. మెటా AI తో జత చేయబడిన డిస్ ప్లే ఉంటుంది. ఈ కొత్త రకం మోడల్ రేబాన్ మెటా స్మార్ట్ గ్లాసెస్ నుంచి ఒక్క టచ్ తో వీడియోలను కూడా చూడొచ్చు.
రేబాన్ మెటా స్మార్ట్ గ్లాసెస్.. క్లాసిక్ రేబాన్ డిజైన్ ను కలిగి ఉంటాయి. టెక్నాలజీతో కూడిన డిజైన్ తో స్టైలిష్ గా ఉంటాయి. ఈ గ్లాసెస్ బ్లూటూత్ సహాయంతో మీ స్మార్ట్ ఫోన్ కు కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లకు వచ్చే నోటిఫికేషన్లను చూసుకోవచ్చు. కొన్ని మోడళ్లలో ఫోటో, వీడియో క్యాప్చర్ కోసం చిన్న కెమెరా కూడా ఉంటుంది. గ్లాసెస్ ఫ్రేమ్ పై టచ్ చేస్తే చాలు పాటలు వినొచ్చు.. కాల్స్ మాట్లాడొచ్చు. ఫొటోలు తీసుకోవచ్చు..వీడియోలు తీసుకోవచ్చు.
ప్రస్తుత మోడళ్లలో విజువల్ డిస్‌ప్లేలేదు..2025 జూన్ లో రాబోయే థర్డ్ జనరేషన్ గ్లాసెస్ డిస్ ప్లే తో వస్తున్నాయి. హ్యాండ్ ఫ్రీ అనుభవాన్ని అందించనున్నాయి.