ప్రస్తుతం సోషల్ మీడియా మన జీవిగాతాన్ని శాసిస్తోంది. సోషల్ మీడియా ప్రభావం ఏ రేంజ్ లో ఉందంటే ఎన్నికల పార్టీల గెలుపు, ఓటములను కూడా శాసించే స్థాయిలో ఉంది. రాజకీయ నాయకులు కూడా తమ ప్రచారం కోసం సోషల్ మీడియాను ఓ రేంజ్ లో వాడుతున్నారు. ఈ క్రమంలో, ఇన్స్టాగ్రామ్ లో పొలిటికల్ కంటెంట్ కి చెక్ చెప్పే విధంగా నిర్ణయం తీసుకుంది మెటా సంస్థ. ఇకపై యుజ్జర్లు పొలిటికల్ కంటెంట్ ని చూడద్దు అనుకుంటే, వాటిని రిస్ట్రిక్ట్ చేసేలా సిట్టింగ్స్ ని అప్డేట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
మెటా అప్డేట్ చేసిన కొత్త సెట్టింగ్స్ ఇంస్టాగ్రామ్ తో పాటు త్రేడ్స్ కి కూడా వర్తిస్తాయి. యూజర్స్ గనక తమ అకౌంట్స్ లో ఈ సిట్టింగ్స్ ఎనేబుల్ చేసుకుంటే పొలిటికల్ కంటెంట్ కనపడకుండా నియంత్రించవచ్చు.ఈ కింద తెలిపిన స్టెప్స్ ని ఫాలో అయినట్లయితే మీ అకౌంట్స్ లో కూడా పొలిటికల్ కంటెంట్ ని నియంత్రించవచ్చు.
- ఇన్స్టాగ్రామ్ ని ఓపెన్ చేయండి
- అకౌంట్ సెట్టింగ్స్ మేనులోకి వెళ్ళండి
- సజెస్టెడ్ కంటెంట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి
- పొలిటికల్ కంటెంట్ మెనూని సెలెక్ట్ చేయండి.
limit political content from people you don't follow అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే మీరు ఫాలో అవ్వని వారి నుండి పొలిటికల్ కంటెంట్ ఇకపై మీ అకౌంట్ లో కనిపించదు.