ట్విట్టర్ బాటలో ఫేస్ బుక్.. వెరిఫికేషన్ టిక్కు డబ్బులు

ట్విట్టర్ బాటలో ఫేస్ బుక్.. వెరిఫికేషన్ టిక్కు డబ్బులు

ట్విటర్‌ తరహాలోనే వెరిఫైడ్‌ అకౌంట్‌ సర్వీస్‌ను ప్రారంభించింది  ప్రముఖ సోషల్‌మీడియా దిగ్గజం మెటా. ఇండియాలో ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ మొబైల్ యూజర్లకు  నెలకు రూ.699డచార్జీతో వెరిఫైడ్‌ అకౌంట్‌ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నట్లుగా ప్రకటించింది.   

ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ యూజర్లకు ఈ సర్వీసును 2023 జూన్ 7 నుంచే ప్రారంభిస్తున్నామని, వెబ్‌ యూజర్లకు త్వరలోనే రూ.599ల నెలవారీ చార్జీతో అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. 

ఫేస్‌బుక్ వెరిఫైడ్ అకౌంట్ పొందాలంటే కొన్ని షరతులు ఉండాలి. వినియోగదారులు తప్పనిసరిగా కనీసం 18 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. యూజర్లు తమ ప్రభుత్వ  ఐడీతో తమ ఖాతాను వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. 

 అప్లికేషన్‌ను పరిశీలించిన తర్వాతే వెరిఫైడ్ బ్యాడ్జి వస్తుంది. ఒకవేళ అప్లికేషన్‌ను తిరస్కరించినట్టైతే చెల్లించిన డబ్బుల్ని వెనక్కి ఇస్తుంది మెటా.  వెరిఫై చేసిన ఖాతాకు భద్రత, మద్దతు లభిస్తుందని కంపెనీ తెలిపింది.