మెటా సంస్థ (ఫేస్బుక్) కొత్త అప్డేట్లను తీసుకువస్తూ యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.అందులో భాగంగా అవతార్లను తీసుకువచ్చింది. ఆ తరువాత అవతార్లకు జుట్టు, దుస్తుల అల్లికను మెరుగుపరిచింది. తమ ప్లాట్‌ఫాంలో ఒక బిలియన్‌కిపైగా అవతార్లను సృష్టించినట్లు కంపెనీ ప్రకటించింది. అలాగే వినియోగదారుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ.. కంపెనీ మరి కొన్ని మార్పులు తీసుకువచ్చింది. ప్రస్తతం వచ్చిన అప్డేట్ సీజన్లకు అనుగుణంగా వ్యక్తుల అవతార్లను మార్చడంలో సహాయపడుతుందని, హిప్స్ డోంట్ లై తో పాటు డ్యాన్స్ సంబంధిత అవతార్లను సైతం జోడిస్తున్నట్లు మెటా ఓ బ్లాగ్ పోస్ట్‌లో రాసింది.
స్టిక్కర్లు, ప్రొఫైల్ ఫొటోలు కూడా..
మెటా స్టిక్కర్లు, ప్రొఫైల్ చిత్రాలు, కవర్ ఫొటోలు, అవతార్ జుట్టు, దుస్తులు, కళ్ల రూపాన్ని సైతం పునరుద్ధరించింది. వినియోగదారుల సంతృప్తి పొందేందుకు తాము ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ముందుకు సాగుతామని మెటా వెల్లడించింది.