తెలంగాణ రాష్ట్రానికి 4 రోజుల రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణశాఖ. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే చాన్స్ ఉందని తెలిపింది. సెప్టెంబర్ 7న( ఈరోజు) తేలికపాటి వానలు.. ఆదివారం (సెప్టెంబర్ 8) నుంచి భారీ, అతిభారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేసింది. మొదటి రెండు (సెప్టెంబర్ 7, 8) రోజులకు ఎల్లో అలర్ట్, తర్వాత రెండు (సెప్టెంబర్ 9,10) రోజులకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఏర్పడిన అల్పపడీనం.. సోమవారం వరకు వాయుగుండంగా మారే అవకాశం ఉందని వివరించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో నాలుగు రోజులు పాటు రాష్ట్రానికి వర్ష సూచన చేసింది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) September 7, 2024