- రాష్ట్రమంతటికీ ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెండ్రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావ రణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఉందని, దాని ప్రభావంతో ఈ నెల 23న వాయువ్య బంగాళాఖా తంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పిం ది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. శనివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్న వాతావరణ శాఖ.. రాష్ట్రమంతటికి ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. హైదరాబాద్ సిటీలోనూ రెండ్రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.