రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు : పశ్చిమబెంగాల్‌‌‌‌‌‌‌‌కు‘దానా’ తుఫాన్‌‌‌‌‌‌‌‌ ముప్పు

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు : పశ్చిమబెంగాల్‌‌‌‌‌‌‌‌కు‘దానా’ తుఫాన్‌‌‌‌‌‌‌‌ ముప్పు

కోల్‌‌‌‌‌‌‌‌కతా: పశ్చిమబెంగాల్‌‌‌‌‌‌‌‌లో ‘దానా’సైక్లోన్ ప్రభావంతో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో బుధవారం ఏర్పడిన ఈ తుఫాన్‌‌‌‌‌‌‌‌ వల్ల కోల్‌‌‌‌‌‌‌‌కతా సహా సౌత్‌‌‌‌‌‌‌‌ బెంగాల్‌‌‌‌‌‌‌‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తుఫాన్‌‌‌‌‌‌‌‌ కారణంగా ఈ నెల 24, 25 తేదీల్లో ఈస్టర్న్‌‌‌‌‌‌‌‌, సౌతర్న్‌‌‌‌‌‌‌‌ రైల్వేలో 150 రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తోపాటు బంగాళాఖాతం తీర ప్రాంతంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు తెలంగాణలో కూడా వాతావరణంపై కూడా ప్రభావం పడనుంది. పలు చోట్లు వర్షాలు కురవనున్నాయని ఐఎండీ హెచ్చరించింది. 

శుక్రవారం తెల్లవారుజామున ఒడిశాలోని భితార్కానికా నేషనల్‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌, ధామ్రా ఓడరేవుల మధ్య గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ తుఫాను బుధవారం ఉదయం పారాదీప్‌‌‌‌‌‌‌‌కు 520 కిలోమీటర్లు, సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వీపానికి 600 కిలోమీటర్ల దూరంలో ఉందని వెల్లడించింది. ఈ నెల 24, 25 తేదీల్లో సౌత్‌‌‌‌‌‌‌‌ బెంగాల్‌‌‌‌‌‌‌‌లోని జిల్లాలతో పాటు 24 పరగణాలు, పుర్బా, పశ్చిమ్‌‌‌‌‌‌‌‌ మెదినీపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రామ్‌‌‌‌‌‌‌‌ , కోల్‌‌‌‌‌‌‌‌కతా, హౌరా, హుగ్లీ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.