తెలంగాణలో రెండు రోజులు ఎల్లో అలర్ట్

తెలంగాణలో రెండు రోజులు ఎల్లో అలర్ట్
  • మోస్తరు నుంచి భారీ వర్షాలకు చాన్స్
  • వాతావరణ శాఖ ప్రకటన

రాబోయే 2 రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది. హైదరాబాద్​ సిటీలోనూ ముసురు కొనసాగే అవకాశం  ఉందని పేర్కొంది. రెండురోజులుగా రాష్ట్ర మంతటా ముసురు కమ్మేసింది. ముఖ్యంగా నిజమాబాద్​, జగిత్యాల, నిర్మల్​, మంచిర్యాల, జయశంకర్​ భూపాలపల్లి జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. 

అత్యధికంగా నిజామాబాద్​ జిల్లా వేంపల్లిలో 13.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జగిత్యాల జిల్లా మల్లాపూర్​లో 9.6, రాయికల్​లో 8.3, నిర్మల్​ జిల్లా ఖానాపూర్​లో 8, జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో 7.9, నిజామాబాద్​ జిల్లా ముప్కల్​లో 7.9, జయశంకర్​ భూపాలపల్లి జిల్లా సార్వాయిపేటలో 7.7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.