తీవ్రవాయుగుండం..ఏపీలో రెండు రోజులు అతిభారీ వర్షాలు

తీవ్రవాయుగుండం..ఏపీలో రెండు రోజులు అతిభారీ వర్షాలు

బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కారణంగా ఏపీ, తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇవాళ (బుధవారం, అక్టోబర్ 16) ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిస్తాయిన వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

మరోవైపు తెలంగాణలో కూడా ఇవాళ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో ఉదయం నుంచి ముసురు పెడుతోంది. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ లలో కొద్దిపాటి వర్షం పడింది. 

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం బలబడి తీవ్ర వాయుగుండంగా మారింది. గంటకు 10 కి.మీల వేగంలో కదులుతోంది. చెన్నైకి 440 కి.మీ, పుదుచ్చేరికి 460 కి.మీ.లు , నెల్లూరుకు 530కిమీల దూరంలో కొనసాగుతోంది.  

ఈ వాయుగుండం రేపు(గురువారం)  తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో విస్తృతంగా వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దక్షిణకోస్తా & రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు, పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  

రేపు(గురువారం) కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40నుంచి -60కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ హెచ్చరించింది.