అలర్ట్..హైదరాబాద్లో భారీ వర్షాలు

అలర్ట్..హైదరాబాద్లో భారీ వర్షాలు

 తెలంగాణకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. రానున్న నాలుగు రోజులు తెలంగాణతో పాటు కోస్తా ఆంధ్రా, కర్ణాటకలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
 

హైదరాబాద్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణశాఖ. నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హైదరాబాద్ కు  ఎల్లో అలర్ట్  ప్రకటించారు అధికారులు. యాదాద్రి భువనగిరి, మల్కాజ్ గిరి, ఖమ్మం, మహబూబాబాద్, నారాయణ్ పేట్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షంతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు  వెదర్ ఆఫీసర్లు.