
గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండలతో సతమతమవుతున్న తెలంగాణ ప్రజలకు మరో ప్రమాదం పొంచి ఉంది. రానున్న నాలుగు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వడగండ్ల వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఆదిలాబాద్ కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, ములుగు, వరంగంల్ జిల్లాల్లో వడగండ్ల వానలు ప్రభావం ఉంటుందని తెలిపింది. శుక్ర శనివారాల్లో ఉరుములు మెరుపులు,ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వానలు కురుస్తాయని ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
గురువారం ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు మెల్లగా ప్రారంభమయ్యాయి. కొన్నిచోట్ల పిడుగులు పడ్డాయి. మార్చి 22 నుంచి వర్షాలు ఉరుములతో కూడిన తుపాను వర్షాలు కురుస్తాయి. వచ్చే 2-4గంటల్లో నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్‌లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉంది. ఈదురు గాలులు బలంగా వీస్తాయి. మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆసిఫాబాద్, జగిత్యాల, సిరిసిల్లలో రాత్రిపూట తుఫానులు ప్రభావం ఉంటుంది.
గురువారం రాత్రి తెలంగాణలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుపడే అవకాశం ఉంది. తెలంగాణలోని సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి,ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నలోని ఏకాంత ప్రాంతాల్లో మెరుపులతో కూడిన తుఫాను ప్రభావం ఉంటుంది.
శుక్రవారం (మార్చి 21) తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాలు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన గంటకు 40నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, వడగండ్ల వాన కురిసే అవకాశం ఉంది.
నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటలకు 30నుంచి -40 కి.మీ.వేగంలో వీచే అవకాశం ఉందని ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
శుక్రవారం తెలంగాణలోని కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్లలోని కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. గంటకు 40నుంచి 50 కి.మీ వేగంలో ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
తెలంగాణలోని మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30నుంచి -40 కి.మీ.వేగంతో ఈదురు గాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.