తెలంగాణ రాష్ట్రంలో రెండ్రోజులు వానలు : పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్​ జారీ

తెలంగాణ రాష్ట్రంలో రెండ్రోజులు వానలు : పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్​ జారీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెండ్రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. శుక్రవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్​, మేడ్చల్–మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది. శనివారం నిజామాబాద్,​ జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్–​మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది. హైదరాబాద్​లో రెండ్రోజుల పాటు మబ్బు పట్టి ఉంటుందని, మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. 

ALSO READ | 9 నుంచి గోవాకు వీక్లీ ట్రైన్

పొద్దున ఎండ.. సాయంత్రం వానరాష్ట్రంలో పొద్దునంతా ఎండ కొట్టగా.. సాయం త్రం కాగానే ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్​ సిటీ సహా పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. గురువారం నల్గొండ, నాగర్​కర్నూల్ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. నిజామాబాద్, మెదక్, వికారాబాద్, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్​నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాల్లో మోస్తరు వర్షం పడింది. అత్యధికంగా నాగర్​కర్నూల్​ జిల్లా వేల్తూరులో 8.4 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయ్యింది.

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో 7 సెంటీ మీటర్లు, ఎర్రారంలో 6.7, కోదండాపురంలో 6.3, నిర్మల్​ జిల్లా అబ్దుల్లాపూర్​లో 6.1, నల్గొండ జిల్లా చలకుర్తిలో 5  సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ సిటీలో పలు చోట్ల మధ్యాహ్నం మోస్తరు వర్షం కురిసింది. అంబర్​పేటలో 2.3 సెంటీమీటర్లు, కంచన్​బాగ్​లో 2.1, ఆస్మాన్​ఘర్​లో 1.9, చంపాపేట్​లో 1.9, హిమాయత్​నగర్​లో 1.7, ఎల్బీనగర్​లో 1.4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయ్యింది. కాగా, ఉదయం  యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో 40.9 డిగ్రీలు, సూర్యాపేట జిల్లాలో 40.6, కామారెడ్డి 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.