ఇండో‑పాక్‌‌‌‌ పోరుకు వర్షం ముప్పు!

ఇండో‑పాక్‌‌‌‌ పోరుకు వర్షం ముప్పు!

శనివారం ఇండియా, పాకిస్తాన్‌‌‌‌ మధ్య జరిగే హై ఓల్టేజ్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. శని, ఆది వారాల్లో అహ్మదాబాద్‌‌‌‌తో పాటు నార్త్‌‌‌‌ గుజరాత్‌‌‌‌లో చిరుజల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ‘రాబోయే ఐదు రోజులు గుజరాత్‌‌‌‌లో వాతావరణం నార్మల్‌‌‌‌గానే ఉంటుంది. కాకపోతే శని, ఆదివారాల్లో అహ్మదాబాద్‌‌‌‌, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో చిరుజల్లులు పడనున్నాయి. వాతావరణం మేఘావృతంగా ఉంటుంది.

బనస్కాంత, సంబర్‌‌‌‌కాంత జిల్లాల్లోనూ వర్షం పడొచ్చు’ అని వాతావరణ శాఖ నివేదికలో పేర్కొంది. ఈ మ్యాచ్‌‌‌‌ కోసం పాక్‌‌‌‌ క్రికెటర్లు ప్రాక్టీస్‌‌‌‌ మొదలుపెట్టారు. ఇండో–పాక్‌‌‌‌ పోరు కోసం ముంబై నుంచి అహ్మదాబాద్‌‌‌‌కు రెండు సూపర్‌‌‌‌ఫాస్ట్‌‌‌‌ స్పెషల్‌‌‌‌ రైళ్లు నడుపుతున్నట్లు వెస్ట్రన్‌‌‌‌ రైల్వే ప్రకటించింది. రైలు బయలుదేరడానికి 20 నిమిషాల ముందు వరకు కూడా టికెట్లను బుక్‌‌‌‌ చేసుకోవచ్చని, 1500 సీట్స్‌‌‌‌ను అందుబాటులో ఉంచామని తెలిపింది.