తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారుగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ 11, 12వ తేదీల్లో పలు చోట్ల వర్షాలు పడుతాయని చెప్పారు. సెప్టెంబర్ 10న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో కురుస్తాయంటున్నారు. పశ్చిమ, ఈశాన్య జిల్లాలలో అక్కడక్కక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 10న పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ జేసింది. సోమవారానికి ఎలాంటి అలర్ట్ జారీ చేయని వాతావరణ శాఖ మంగళ, బుధవారాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ALSOREAD:గ్రేటర్ హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం
రాష్ట్రంలో మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కక్కడ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు.