లైంగికంగా వేధింపులపై శిక్షలు: 260 రేప్ లు… 125 ఏళ్ల జైలు

మీటూ ఆరోపణలకు గురైనవాళ్లలో హర్వే వీన్​స్టీన్​ సహా ఏడుగురికి ఇప్పటివరకు శిక్ష పడింది. ఇంకా నలుగురిపై విచారణ సాగుతోంది.

వీళ్లే ఆ ప్రముఖులు

260 రేప్​లు… 125 ఏళ్ల జైలు
డాక్టర్​ లారీ నాసర్​, అమెరికా జిమ్నాస్టిక్స్​ జాతీయ టీమ్​ : మీటూకి సంబంధించి నాసర్​పైనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. జిమ్నాస్టిక్స్​ నేర్చుకోవడానికి వచ్చిన అమ్మాయిల్లో దాదాపు 260 మందిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు రుజువయ్యాయి. 2018లో డాక్టర్​ నాసర్​కి 125 ఏళ్ల జైలు శిక్ష పడింది.

బిల్​ కాస్బీ, కమెడియన్​ : దాదాపు 16 ఏళ్ల క్రితం ఒక మహిళను తాగించి, లైంగికంగా వేధించినట్లు రుజువు కావడంతో… ఆయా నేరాలకు మూడు నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్షలు పడ్డాయి.

జీన్​ క్లాడ్​ అర్నాల్ట్, ఫ్రెంచ్​ ఫొటో గ్రాఫర్​ : 2011లో ఒక అమ్మాయిని రేప్​ చేసినందుకుగాను 2018లో జైలు పాలయ్యాడు.

అలిసన్​ మాక్, నటి: నెక్సీమ్​ కల్ట్​కి మహిలను రిక్రూట్​ చేసినట్లుగా నేరం రుజువైంది. కీత్​, ఆలిసన్​లకు శిక్షలు ఖరారు కాలేదు.

విలియం స్ట్రాంపెల్​, మిచిగాన్​ యూనివర్సిటీ మాజీ డీన్​ : డాక్టర్​ నాసర్​పై ఆరోపణలకు సంబంధించి ‘కావాలని పట్టించుకోలేదన్న’ ఆరోపణలపై విలియంకు ఏడాది శిక్ష పడింది.

కీత్​ రనీరే, నెక్సీమ్​ కల్ట్​ నాయకుడు : నెక్సీమ్ కల్ట్​ని సెక్స్​వల్​ చర్యలకోసం మహిళలను, పిల్లలను రిక్రూట్​ చేస్తుందనే ఆరోపణలున్నాయి. కీత్​ రనీరేపై సెక్స్​ ట్రాఫికింగ్, పిల్లలపై సెక్సువల్​ చర్యలు,  చైల్డ్​ పోర్నోగ్రఫీ లాంటి పనులపై నేరం రుజువైంది.