మెట్‌పల్లి బల్దియా ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. మూడేండ్ల నుంచి బయోమెట్రిక్ అటెండెన్స్ ఉన్నా రిజిస్ట్రర్‌లోనే సంతకం పెడుతున్నారు. బయోమెట్రిక్ అటెండెన్స్‌ను పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు ఉదాసీనంగా ఉండడంతో కింది స్థాయి ఉద్యోగులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు.
కొందరు ఉద్యోగులు దూర ప్రాంతాల నుంచి అప్ అండ్డౌన్ చేస్తూ రోజూ లేటుగా వచ్చి ఆఫీస్ టైంకు గంట ముందుగానే వెళ్తున్నారన్న ఆరోపణలున్నాయి. మెట్‌పల్లి బల్దియాలో బుధవారం ఉదయం 10: 50 అయినా ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఉద్యోగులు టైంకు రావాలని, లేకపోతే చర్యలు తీసుకుంటానని మెట్‌పల్లి మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్ హెచ్చరించారు. -_ మెట్ పల్లి, వెలుగు