
మెట్‌పల్లి, వెలుగు: మెట్‌పల్లి మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ పన్నాల మాధవ్ రెడ్డి బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. సోమవారం హైదరాబాద్‌లో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు.. మాధవ్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైర్‌పర్సన్ భర్త తీరుకు నిరసనగా బీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తన్నట్లు చెప్పారు. కాంగ్రెస్ సర్కారు అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు ఆకర్షితులై కాంగ్రెస్ లో చేరినట్లు తెలిపారు.