![మాస్టర్ ప్లాన్ అమలుకు డ్రోన్ సర్వే : గౌతమ్‌రెడ్డి](https://static.v6velugu.com/uploads/2025/02/metpalli-municipality-adopts-drone-survey-for-master-plan-implementation_QDKtZFwqf3.jpg)
అడిషనల్ కలెక్టర్ గౌతమ్‌రెడ్డి
మెట్‌పల్లి, వెలుగు: మెట్‌పల్లి మున్సిపాలిటీలో డ్రోన్ సర్వే చేసి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ గౌతమ్‌రెడ్డి రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని మినీ స్టేడియంలో డీటీసీపీ అధికారుల సమక్షంలో ఏర్పాటు చేసిన డ్రోన్ సర్వేను కమిషనర్ మోహన్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమృత్2.0 పథకంలో భాగంగా డ్రోన్‌ద్వారా సేకరించిన కచ్చితమైన మ్యాపింగ్‌తో బిల్డింగ్‌లు, రోడ్లు, నీటి వనరులు, పార్కులు వంటి మౌలిక వసతుల స్థితిని పరిశీలించి సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.
భవిష్యత్ తరాలకు డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంచడమే లక్ష్యమన్నారు. అనంతరం ట్యాబ్‌లో సర్వే తీరును పరిశీలించారు. అనంతరం మున్సిపల్ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. మేనేజర్ వెంకటలక్ష్మి, టీపీవో రాజేంద్రప్రసాద్, ఏఈ తిరుపతి, ఆర్‌వో మీర్జా అజ్మతుల్లా బేగ్, ఇన్‌చార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్ రత్నాకర్, ముజీబ్, శివ పాల్గొన్నారు.