జగిత్యాల జడ్పీ సర్వసభ్య సమావేశంలో జిల్లా మంత్రి ముందే మెట్ పల్లి జడ్పీటీసీ నిరసనకు దిగారు . మెట్ పల్లి మండలానికి నిధులు కేటాయించడం లేదని జడ్పీ సమావేశంలోనే ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. మెట్ పల్లికి వచ్చే నిధులను ఎమ్మెల్యే దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. జగిత్యాలలోని అన్ని మండలాలకు నిధులు కేటాయించినప్పుడు మెట్ పల్లికి ఎందుకు నిధులు దారి మళ్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తమ మండలానికి నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు.