హైదరాబాద్, వెలుగు: మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి గురువారం మెట్రో రైల్‌భవన్‌లో ఎల్అండ్టీ, ఎంఆర్ హెచ్ఎల్ ఎండీ కేవీబీ రెడ్డి, టీఎంఆర్ హెచ్ఎల్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కంపెనీ కియోలిస్, హెచ్ఎమ్ఆర్ఎల్, ఇండిపెండెంట్ ఇంజనీర్ ఏఈసీఓఎం సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. రైళ్లను నిరంతరాయంగా నడపాలని చెప్పారు.
24 గంటలూ అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షించాలని సూచించారు. మెట్రో వయాడక్ట్ పక్కనే ఉన్న చెట్లను క్రమం తప్పకుండా కట్‌చేయాలని, ప్లాట్‌ఫాంలపై వర్షపు నీరు నిలవకుండా చూసేందుకు సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. మెట్రో స్టేషన్ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, లిఫ్టులు, ఎస్కలేటర్ల వద్ద వర్షపు నీరు నిలవకుండా చూడాలన్నారు. ట్రాక్‌లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సూచించారు.