ప్యాసింజర్ల సేఫ్టీనే ప్రయారిటీ : మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

ప్యాసింజర్ల సేఫ్టీనే ప్రయారిటీ : మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

హైదరాబాద్ సిటీ, వెలుగు : ప్యాసింజర్ల సేఫ్టీనే తమ ఫస్ట్ ​ప్రయారిటీ అని మెట్రో రైల్​ఎండీ ఎన్వీఎస్  రెడ్డి వెల్లడించారు. ఎల్అండ్​టీ, మెట్రో రైల్​ తొలి భద్రతా సెమినార్‌ను గురువారం నిర్వహించగా, సంస్థల ఉన్నతాధికారులు, భద్రతా నిపుణులు పాల్గొన్నారు.  ప్రాజెక్ట్  నిర్మాణం, నిర్వహణలో భద్రత, ప్రాధాన్యతను ఎన్వీఎస్  రెడ్డి వివరించారు. 

మెట్రో నిర్మాణ సమయంలో జీరో- ఫాటాలిటీ రికార్డును సాధించినందుకు అనేక అవార్డులు వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, మెరుగైన రీతిలో  మెట్రో వ్యవస్థ కొనసాగుతుందని ఎల్అండ్​టీ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి హామీ ఇచ్చారు.