హైదరాబాద్ లోని ఉప్పల్ స్డేడియంలో ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చూసేందుకు చాలా మంది అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో మ్యాచ్ చూసేందుకు ఉప్పల్‌కు వచ్చే క్రికెట్ అభిమానులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ మెట్రో రైళ్లు నిర్ణీత సమయానికి మించి నడుస్తాయని మెట్రోఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
చివరి మెట్రో రైళ్లు వాటి టెర్మినల్ నుంచి రాత్రి 12.15 గంటలకు బయల్దేరి 1.10 గంటలకు తమ గమ్యస్థానాలకు చేరుకుంటాయని తెలిపింది. నాగోల్, ఉప్పల్, స్టేడియం & NGRI స్టేషన్‌లలో మాత్రమే ప్రవేశం ఉంటుందని వెల్లడించింది. ఇక మెట్రోతో పాటుగా టీఎస్ ఆర్టీసీ ఉప్పల్ స్డేడియానికి పలు ప్రాంతాల నుంచి 60 స్పెషల్ బస్సులను నడుపుతుంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై.. తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయి.
ఐపీఎల్ 17వ సీజన్ లో హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఏడు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ మార్చి 27న ముంబైతో.. . ఆ తర్వాత ఏప్రిల్ 5న చెన్నై సూపర్ కింగ్స్, ఏప్రిల్ 25న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మే 2న రాజస్థాన్ రాయల్స్, మే 8న లక్నో సూపర్ జెయింట్స్, మే 16న గుజరాత్ టైటాన్స్, మే 19న పంజాబ్ కింగ్స్ జట్టుతో హైదరాబాద్ ఆడుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మ్యాచ్‌లు హైదరాబాద్‌లో లేవు.