
హైదరాబాద్లో మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యతో నాంపల్లి, అసెంబ్లీ స్టేషన్ల మధ్య మెట్రో రైలు నిలిచిపోయింది. దాదాపు 15 నిమిషాల పాటు రైలు ఆగిపోయింది. దీంతో ఎల్బీ నగర్అమీర్ పేట్ మధ్య మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఆఫీసులు, కాలేజీల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వెంటనే రంగంలోకి దిగిన మెట్రో అధికారులు టెక్నికల్ ప్రాబ్లమ్ ను సాల్వ్ చేసి రైళ్లను పునరుద్ధరించారు. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని మెట్రో అధికారులు ప్రయాణికులకు క్షమాపణ చెప్పారు.