
తెల్లవారుజాము వరకు ఎంఎంటీఎస్ సర్వీసులు
గురువారం రాత్రి 11 గంటల నుంచి శుక్రవారం 4.40 గంటల వరకు ఎంఎంటీఎస్ ప్రత్యేక సర్వీసులను సౌత్ సెంట్రల్ రైల్వే నడుపనుంది. హైదరాబాద్– లింగంపల్లి, సికింద్రాబాద్– హైదరాబాద్, లింగంపల్లి – ఫలక్ నుమా మధ్య మొత్తం 8 ఎంఎంటీఎస్ రైళ్లు తెల్లవారుజాము వరకు సేవలందించనున్నాయి.
ఆర్టీసీ.. 535 స్పెషల్ బస్సులు
నిమజ్జనం, శోభాయాత్ర నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ 535 స్పెషల్ బస్సులను నడుపనుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఒక్కో డిపో నుంచి 15 నుంచి 20 బస్సులను ఏర్పాటు చేశారు. ప్రత్యేక బస్సుల సమాచారం కోసం రెతిఫైల్ బస్ స్టేషన్ నం. 9959226154, కోఠి బస్ స్టేషన్నం. 9959226160ను సంప్రదించాలి.
అర్ధరాత్రి వరకు మెట్రో సర్వీసులు
గణనాథుల శోభాయాత్ర, నిమజ్జనం సందర్భంగా గురువారం ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో రైల్ సర్వీసులు నడుపనున్నట్లు హైదరాబాద్ మెట్రో పేర్కొంది. చివరి రైలు అర్ధరాత్రి ఒంటిగంటకు బయలుదేరి 2 గంటలకు డెస్టినేషన్‌కు చేరుకుంటుంది.