హైదరాబాద్ సిటీలో మెట్రో సౌండ్ వార్ .. ప్రజావాణిలో బోయిగూడవాసుల ఫిర్యాదు

హైదరాబాద్ సిటీలో మెట్రో సౌండ్ వార్ .. ప్రజావాణిలో బోయిగూడవాసుల ఫిర్యాదు
  • ఎక్కువ సౌండ్​ వస్తున్నదని ప్రజావాణిలో బోయిగూడవాసుల ఫిర్యాదు 
  • ‘అమెరికన్’ ​రూల్స్​ పాటించామంటూ మెట్రో ఆన్సర్​
  • కంప్లయింట్​ డిస్పోజ్​ చేసిన ఆఫీసర్లు
  • ‘ఇండియన్’​ రూల్స్​ ఫాలో కావాలంటున్న బాధితులు 
  • ప్రజావాణి ఆఫీసర్లను తప్పుదోవ పట్టించారని ఆరోపణ 

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ మెట్రో ఆఫీసర్లకు, బోయిగూడ జంక్షన్ ​వద్ద ఎంఎన్​కే అపార్ట్​మెంట్​వాసులకు మధ్య మెట్రో రైళ్ల సౌండ్ పొల్యూషన్​ లొల్లి కొనసాగుతూనే ఉంది. బోయిగూడ జంక్షన్​ పిల్లర్   బీ –1006 వద్ద రైలు వచ్చినప్పుడు వచ్చే సౌండ్స్​తో తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని, 80 డెసిబుల్స్​నమోదవుతుండడంతో మెట్రో అధికారులు ట్రాక్​కు గ్రీస్​ పూసి చేతులు దులుపుకుంటున్నారని అపార్ట్ మెంట్ వాసులు ఆరోపిస్తూ..  ఎన్నో ఫిర్యాదులు చేశారు. ఈ మధ్యే కలెక్టరేట్ లో  ప్రజావాణిలోనూ కంప్లయింట్ ​చేశారు. అయితే, దీనికి మెట్రో అధికారులు ‘అమెరికన్​ పబ్లిక్ ట్రాన్స్​పోర్టు అథారిటీ(ఏపీటీఏ)కి సంబంధించిన సౌండ్ పొల్యూషన్ ​రూల్స్​ను జత చేస్తూ, రూల్స్ కు లోబడే సౌండ్స్ నమోదవుతున్నాయి’ అంటూ వివరణ ఇచ్చారు. దీనికి సంతృప్తి చెందిన అధికారులు ఫిర్యాదును డిస్పోజ్ ​చేశారు. దీనిపై అపార్ట్​మెంట్​వాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

మెట్రోకు ఏపీటీఏ రూల్స్ వర్తించవు

ఏపీటీఏ రూల్స్  మెట్రోకు వర్తించవని, ఇండియన్​ రైల్వే మెట్రో ట్రాన్సిట్ సిస్టమ్​కు  ప్రత్యేకంగా రెకమండేషన్లు చేసిందని, వాటిని మెట్రో అధికారులు ఫాలో కావాలని అపార్ట్​మెంట్​ వాసులు అంటున్నారు. ప్రజావాణి ఫిర్యాదుకు మెట్రో అధికారులు తప్పుడు వివరణ ఇచ్చారని ఆరోపిస్తున్నారు. ఇండియన్ గవర్నమెంట్ రూల్స్​ ప్రకారం.. రెసిడెన్షియల్​ఏరియాల్లో పగలు 55 డెసిబుల్స్, రాత్రి 45 డెసిబుల్స్ కు మాత్రమే పర్మిషన్ ​ఉంటుంది. 

ఏపీటీఏ ప్రకారం హై డెన్సిటీ రెసిడెన్షియల్​ఏరియాల్లోని మల్టీ ఫ్యామిలీస్ (అపార్ట్​మెంట్లు)​ఉండే ఏరియాల్లో 80 డెసిబుల్స్ వరకు అనుమతి ఉంటుంది. దీంతో ఈ నిబంధన అనుకూలంగా ఉండడంతో మెట్రో అధికారులు ప్రజావాణి ఫిర్యాదుకు సమాధానంగా ఇచ్చారని అపార్ట్​మెంట్ ​వాసులు చెప్తున్నారు. రెకమండేషన్లలో ఇండియన్​గవర్నమెంట్ రూల్సే మెట్రోకు వర్తిస్తాయని ఇండియన్ రైల్వే మినిస్ట్రీ స్పష్టంగా చెప్పిందంటున్నారు. కానీ, ప్రజావాణి అధికారులను మెట్రో ఆఫీసర్లు తప్పుడు కాపీ జతపరిచి తప్పు దారి పట్టించారంటున్నారు. దీనిఐ మెట్రో అధికారులను వివరణ అడగగా నిరాకరించారు. 

రాత్రిళ్లు 80 డెసిబుల్స్​..

సాధారణంగా మెట్రో సర్వీసులు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నడుస్తుంటాయి.  కోచ్​ల మెయింటనెన్స్​ కోసం రాత్రిళ్లు డిపోలకు తీసుకువెళ్లే టైంలో వస్తున్న సౌండ్​భరించలేకపోతున్నామని బోయిగూడ ఎమ్ఎన్​కే అపార్ట్​మెంట్​వాసులు అంటున్నారు.  గతేడాది మార్చి 6న అర్ధరాత్రి మెట్రో అధికారులు  సౌండ్ ​రికార్డు చేయగా 80 డెసిబుల్స్ నమోదైంది. జీవో  172  కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ మెట్రో ట్రాన్సిట్ గైడ్​లైన్స్​ ప్రకారం రెసిడెన్షియల్​ఏరియాల్లో రాత్రి పరిమిత సౌండ్ 45 డెసిబుల్స్ మాత్రమే ఉండాలి. కానీ, మెట్రో రైళ్లు, ట్రాక్​  సౌండ్ అధికంగా ఉంది. దీన్ని తగ్గించడానికి మినిస్ట్రీ ఆఫ్​ రైల్వే పలు సూచనలు చేసింది. ఇందులో వీల్ ట్రీట్మెంట్ తో పాటు, మెయింటనెన్స్, సౌండ్ బారియర్స్​ఏర్పాటు చేయడం లాంటివి ఉన్నాయి. అయినా మెట్రో అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని అపార్ట్​మెంట్​ వాసులు ఆరోపిస్తున్నారు.