సాంకేతిక సమస్యతో నిలిచిపోయిన మెట్రో.. ఎమర్జెన్సీ నుంచి బయటపడ్డ ప్రయాణికులు

సాంకేతిక సమస్యతో నిలిచిపోయిన మెట్రో.. ఎమర్జెన్సీ నుంచి బయటపడ్డ ప్రయాణికులు

హైదరాబాద్ లో మెట్రో రైలు సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. మెట్రో ఎర్రమంజిల్ దగ్గరకు రగానే సాంకేతిక తలెత్తింది. దీంతో రైలును నడపకుండా అధికారులు నిలిపివేశారు. ట్రైన్ సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు.  ట్రైన్ లోపల గాలి ఆడక ప్రయాణికులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ట్రైన్ డోర్లు ఓపెన్ కాకపోవడంతో ట్రైన్ పైలెట్ ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసి ప్రయాణికులను బయటకు పంపించారు. 

ట్రైన్ లోని ప్రయాణికులంతా ఒక్కసారిగా బయటకు రావడంతో స్టేషన్ కిక్కిరిసింది. ప్రయాణికులతో రద్దీగా మారింది. సెక్యూరిటీ సిబ్బంది తక్కువ మంది ఉండటంతో మెట్రో స్టేషన్ లోని అధికారులు సైతం ప్రయాణికులను పట్టాలపైకి రానివ్వకుండా జాగ్రత్తాగా కిందకు పంపించారు. మెట్రో సాంకేతికతను రిపేర్ చేస్తున్నా్మని అధికారులు తెలిపారు. వెనక వచ్చే ట్రైన్స్ కు అంతరాయం కలగకుండా చేస్తున్నామని వెల్లడించారు.