మెట్రో వాటర్​బోర్డుకు ‘వరల్డ్ వాటర్ అవార్డు’

మెట్రో వాటర్​బోర్డుకు ‘వరల్డ్ వాటర్ అవార్డు’

హైదరాబాద్​ సిటీ, వెలుగు: మెట్రో వాటర్​బోర్డుకు ‘వరల్డ్ వాటర్ అవార్డు’ దక్కింది. వాటర్ డైజెస్ట్ అనే అంతర్జాతీయ సంస్థ 2024--–25 సంవత్సరానికి గానూ ఈ అవార్డు అందజేసింది. యునెస్కో భాగస్వామ్యంతో 19వ వాటర్ డైజెస్ట్ వరల్డ్ వాటర్ అవార్డుల ప్రదానం మార్చి 31న ఢిల్లీలో జరిగింది. బోర్డు ఈడీ మయాంక్ మిట్టల్, డైరెక్టర్ సుదర్శన్ పాల్గొని అందుకున్నారు.

ఎస్టీపీల నిర్వహణలో హైదరాబాద్ ​మెట్రో వాటర్​బోర్డు ఉత్తమంగా నిలవడంతో ఈ అవార్డు దక్కింది. డైరెక్టర్ సుదర్శన్ బుధవారం హెడ్డాఫీసులో ఎండీ అశోక్ రెడ్డికి అవార్డును అందజేశారు. ఎస్టీపీల నిర్వహణకు  అవార్డు రావడంపై ఎండీ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీ సీజీఎంలు పద్మజ, సుజాత, జీఎం కుమార్, డీజీఎం నిరుపమ మేనేజర్లు పాల్గొన్నారు.