హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో సీవరేజీ సమస్యల పై దృష్టిపెట్టాలి: మెట్రో వాటర్​బోర్డు ఎండీ

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో సీవరేజీ సమస్యల పై దృష్టిపెట్టాలి: మెట్రో వాటర్​బోర్డు ఎండీ
  • ఎల్బీనగర్, నాగోల్ లో పర్యటించిన ఎండీ అశోక్​రెడ్డి

హైదరాబాద్​సిటీ,వెలుగు: శివారు ప్రాంతాల్లోని పలు ప్రాంతాల్లో సీవరేజీ సమస్యలు అధికంగా ఉన్నాయని, వాటి పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని మెట్రో వాటర్​బోర్డు ఎండీ అశోక్​రెడ్డి అధికారులను ఆదేశించారు. సీవరెజ్ ఓవర్ ఫ్లో నివారణ పై చేపట్టిన 90 రోజుల స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఓ అండ్ ఎం డివిజన్ 10, 11 పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. 

ల్బీనగర్, నాగోల్ ప్రాంతాల్లో చేపడుతున్న డీ-సిల్టింగ్, సీవరెజ్, మ్యాన్ హోళ్ల పునర్ నిర్మాణం పనుల్ని ఆయన పరిశీలించారు. ఓల్డ్ నాగోల్ విలేజ్ లోగతంలో జీహెచ్ఎంసీ నిర్మించిన సీవరెజ్ లైన్లను రెయిన్ వాటర్ డ్రైన్ కు అనుసంధానం చేయగా.. రెయిన్ వాటర్ డ్రైన్ కు డీ-సిల్టింగ్ పనులు చేపట్టకపోవడంతో మురుగు పొంగి రోడ్లపైకి వస్తోందని, కొత్త సీవరేజ్ పైపులైన్ నిర్మించి మూసీ లో ఉన్న సీవరేజ్ ట్రంక్ మెయిన్ కు అనుసంధానిచాలని ఎండీ సూచించారు.

 అనంతరం ఎల్బీనగర్ లోని వాస్తు కాలని, హోటల్ స్వాగత గ్రాండ్ పరిసర ప్రాంతాలకు ఎండీ వెళ్లారు. అక్కడ ఉన్న దాదాపు 15 కాలనీల్లో చాలా కాలంగా సీవరెజ్ ఔట్ లెట్ లేక మురుగు సమస్యలు తలెత్తుతున్నాయని, వాటిని పరిష్కరించాలని సిబ్బందికి ఆదేశించారు. సీవరెజ్ పైపు లైన్ లను అప్ గ్రేడ్ చేసుకోవానికి వారికి నోటీసులు ఇవ్వాలని  అధికారులకు చెప్పారు.