- మెట్రో వాటర్‌బోర్డు ఆదేశాలు
- పాత ఇంటి స్థానంలో కొత్త ఇల్లు కట్టినా తప్పదు
- బోర్డు కనెక్షన్లపై ఒత్తిడి పెరుగుతుండడంతో నిర్ణయం
- లేకపోతే నోటీసులు జారీ చేసేందుకు సిద్ధం
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో కొత్తగా ఇండ్లు కట్టుకునేవారితో పాటు అపార్ట్మెంట్లు, హైరైజ్నిర్మాణదారులకు సీవరేజీ కనెక్షన్ పర్మిషన్తప్పనిసరి చేస్తూ మెట్రోవాటర్ బోర్డు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇండిపెండెంట్హౌస్ను కూల్చి అపార్ట్మెంట్లేదా హైరైజ్బిల్డింగ్కట్టినా డ్రైనేజీ మాత్రం పాత కనెక్షన్‌కే కలుపుతున్నారు. దీంతో పైప్లైన్లపై ఒత్తిడి పెరిగి అవి ఓవర్‌ఫ్లో కావడం, కొన్ని సందర్భాల్లో పైప్లైన్లు పగిలిపోవడం జరుగుతోంది. దీంతో వర్షాల టైంలో, సాధారణ రోజుల్లో సీవరేజీ పారుతోంది. దీంతో వాటర్‌బోర్డు అధికారులే రిపేర్చేయాల్సి వస్తోంది.
పాత పైప్లైన్లపై ఒత్తిడి పెరిగి..
ప్రస్తుతం గ్రేటర్‌పరిధిలో కొత్తగా వేల సంఖ్యలో ఇండిపెండెంట్ఇండ్లు కట్టుకుంటున్నవారు, అపార్ట్మెంట్లు, హోటల్స్, హాస్టల్స్, హాస్పిటల్స్నిర్మించుకుంటున్నవారు వాటర్‌బోర్డు పర్మిషన్లేకుండానే నేరుగా డ్రైనేజీ లైన్లను బోర్డు సీవరేజీ లైన్లలో కలిపేస్తున్నారు. ఇండిపెండెంట్ఇల్లయితే నలుగురు లేదా ఆరుగురు ఉంటారు. కానీ, అదే స్థలంలో అపార్ట్మెంట్కడితే కనీసం ఐదు నుంచి పది కుటుంబాలు ఉంటున్నాయి.
వీరు పాత పైప్‌లైన్లకే కనెక్షన్ఇచ్చుకుంటున్నారు. బల్దియా పరిధిలో నెలకు 5 వేల వరకు ఇండ్ల నిర్మాణాలకు, ఐదు వందల వరకు అపార్ట్మెంట్ల నిర్మాణాల అనుమతులకు దరఖాస్తులు వస్తుంటాయి. హెచ్ఎండీఏ పరిధిలో కూడా నెలకు దాదాపు 250 వరకు హైరైజ్బిల్డింగుల నిర్మాణాలు, విల్లాలు, టౌన్‌షిప్‌ల కోసం అప్లికేషన్లు వస్తుంటాయి. ఇందులో చాలా తక్కువ మంది డ్రైనేజీ కనెక్షన్కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. మిగతా వారంతా మేస్త్రీలు, ప్లంబర్లతో డ్రైనేజీ లైన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు.
దీని వల్ల వాటర్‌బోర్డు లైన్లపై ఒత్తిడి పెరుగుతోంది. అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటే ఆయా భవనాల అంతస్తులు, ప్లాట్వైశాల్యాన్ని బట్టి ఎంత సైజు డ్రైనేజీ లైన్లను ఏర్పాటు చేసుకోవాలి, మ్యాన్‌హోల్స్ నిర్మాణం ఎలా ఉండాలన్నది అధికారులు సూచిస్తారు. ఇవేమీ లేకుండా నేరుగా డ్రైనేజీ లైన్లు నిర్మించుకోవడం, మ్యాన్‌హోల్స్‌లోకి కనెక్షన్లను కలపడం నిబంధనలను ఉల్లంఘించడమేనని అంటున్నారు. బోర్డు అనుమతి లేకుండా డ్రైనేజీ లైన్లను నిర్మించుకున్న వారికి నోటీసులు జారీ చేస్తున్నట్టు
అధికారులు తెలిపారు.
సీవరేజీ కనెక్షన్కోసం తవ్వుతూ వాటర్లైన్ధ్వంసం
గండిపేటలో కొద్దిరోజుల కింద వాటర్‌బోర్డు పర్మిషన్తీసుకోకుండా ఓ నిర్మాణదారుడు సీవరేజీ లైన్ల కోసం తవ్వుతూ తాగునీటి లైన్లను ధ్వంసం చేశాడు. ఆపరేషన్అండ్మెయింటెనెన్స్డివిజన్–18 పరిధిలోని గండిపేట విలేజ్‌లోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సమీపంలో ఓ ఇండిపెండెంట్ ఇంటి నిర్మాణదారుడు కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి డ్రైనేజీ లైన్కలిపేందుకు తవ్వుతుండగా పక్కనే ఉన్న 500 ఎంఎం ఫీడర్మెయిన్లైన్ ధ్వంస మైంది.
దీంతో తాగునీరు వృథాగా పోయింది. 800 డొమెస్టిక్కనెక్షన్దారులకు, 20 బల్క్కనెక్షన్దారులకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో సదరు వ్యక్తిపై క్రిమినల్కేసు నమోదు చేయాలని మెట్రోవాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.