
వైజాగ్: ఆంధ్రప్రదేశ్‌లో లలితా జ్యువెలరీ షాపులపై తూనికలు, కొలతల శాఖ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. విజయవాడ, నెల్లూరు, రాజమహేంద్రవరం, విశాఖ సహా పలుచోట్ల ఏకకాలంలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. తూనికలు, కొలతల శాఖ కమిషనర్ దామోదర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టిన ప్రత్యేక బృందాలు పలు దుకాణాల నుంచి బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. బంగారం నాణ్యత పరిశీలనకు ప్రయోగశాలకు పంపుతామని అధికారులు తెలిపారు.