పొద్దున కాంగ్రెస్..సాయంత్రం బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌

చౌటుప్పల్, వెలుగు: ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ కొందరు నేతలు కండువాలు మార్చినట్లు పార్టీలు మారుస్తున్నారు.  యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పీపుల్ పహాడ్ గ్రామానికి చెందిన మెట్టు మహేశ్వర్ రెడ్డి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌  మండల ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. 

ఉద్యమంలో పని చేసిన నాయకులకు ప్రాధాన్యం ఇవ్వట్లేదని శనివారం పొద్దున హైదరాబాద్‌‌‌‌లో పీసీసీ ప్రధాన కార్యదర్శి చలమల కృష్ణారెడ్డి నివాసంలో కాంగ్రెస్‌‌‌‌లో చేరాడు. 

ఏమైందో ఏమో సాయంత్రంలోగా మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరిగి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరాడు. ఎన్నికలు సమీపిస్తున్న  టైమ్ లో ఇలాంటివి భవిష్యత్తులో మరికొన్ని జరిగే అవకాశాలు లేకపోలేదు.