- పాపులారిటీ కోసమే సీఎంపై తప్పుడు ఆరోపణలు: మెట్టు సాయి కుమార్
హైదరాబాద్, వెలుగు: బీజేపీ శాసన సభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి రాజకీయ అజ్ఞాని అని ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీని ఎవరూ గుర్తించడం లేదని, అందులో ఆ పార్టీ ఎల్పీ లీడర్ ను అసలే గుర్తించడం లేదని, అందుకే మీడియాలో ప్రచారం కోసం సీఎం రేవంత్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
శుక్రవారం హైదరాబాద్ లో మీడియాకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం రేవంత్ కు కాంగ్రెస్ హైకమాండ్ తో బలమైన సంబంధాలు ఉన్నాయని, ఆయనపై అధిష్టానానికి మంచి అభిప్రాయం ఉందన్నారు. ఢిల్లీ పెద్దల సంపూర్ణ విశ్వాసంతోనే రేవంత్ సీఎంగా పని చేస్తున్నారని.. ఈ విషయాన్ని మహేశ్వర్ రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. మరోసారి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడొద్దని సూచించారు.