మీరు అధికారంలోకి రాలేరు..కేటీఆర్ వ్యాఖ్యలపై మెట్టు సాయి కుమార్​ ఫైర్

మీరు అధికారంలోకి రాలేరు..కేటీఆర్ వ్యాఖ్యలపై మెట్టు సాయి కుమార్​ ఫైర్

హైదరాబాద్, వెలుగు: మూడేండ్ల తర్వాత తామే అధికారంలోకి వస్తామని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మండిపడ్డారు. శుక్రవారం గాంధీ భవన్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మూడేండ్ల తర్వాత కాదు కాదా....పదమూడేండ్లు అయినా రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ కు అధికారం అప్పగించే పరిస్థితి లేదన్నారు.

గత పదేండ్లు   నిరుద్యోగులకు బీఆర్ఎస్ చేసిన మోసంపై గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి కేటీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారిగా కలిసి పనిచేసే బదులు.. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసి భారతీయ జనతా రాష్ట్ర సమితిగా మార్చుకోవాలని మెట్టు సాయి సూచించారు.