నీకు దమ్ముంటే ఎమ్మెల్సీకి రిజైన్ చెయ్ : మెట్టు సాయి

నీకు దమ్ముంటే ఎమ్మెల్సీకి రిజైన్ చెయ్ : మెట్టు సాయి
  • తీన్మార్ మల్లన్నపై ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి ఫైర్

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ ను రాజీనామ చేయమని కోరే  నైతిక అర్హత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ఎక్కడిదని రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి ఫైర్ అయ్యారు. పార్టీలు మారే వ్యక్తి కూడా రేవంత్ ను సీఎం పదవికి రాజీనామా చేయమని కోరడం హాస్యాస్పదమన్నారు. తీన్మార్ మల్లన్నకు దమ్ము, ధైర్యం ఉంటే ముందు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

తీన్మార్ మల్లన్న మారని పార్టీ లేదని, బీసీ ముసుగులో చిల్లర పనులు చేస్తున్నడని మండిపడ్డారు. ఇంకోసారి రేవంత్ ను విమర్శిస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఇచ్చే బిస్కట్లు తిని రేవంత్ ను, కాంగ్రెస్ ను ఆయన విమర్శిస్తున్నాడని, తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని మెట్టుసాయి పేర్కొన్నారు.