మెక్సికోలో తొలి రామమందిరం..వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన

ఉత్తర అమెరికా దేశమైన మెక్సికోలో తొలి రామాలయం వెలిసింది. జనవరి 22న అయోధ్య రామమందిరంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠా మహోత్సవానికి కొన్ని గంటల ముందు అంటే ఆదివారం (జనవరి21) మెక్సికోలోని క్వెరెటా నగరంలో తొలి శ్రీరామమందిరాన్ని ప్రారంభించారు. భారతీయ ప్రవాసులు ఆలపించిన కీర్తనలు, పాటల మధ్య దేవతా మూర్తుల ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని అమెరికన్ పూజారి మెక్సికన్ అతిథులో కలిసి నిర్వహించారు. అనంతరం ఆలయాన్ని ప్రారంభించి భక్తుల కోసం తెరిచారు. 

కొత్తగా నిర్మించిన ఆలయంలో ప్రతిష్ఠించిన విగ్రహాలను భారత్ నుంచి తీసుకెళ్ళడం విశేషం. మెక్సికోలోని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘ మెక్సికోలో ఇది మొదటి రామమందిరం.. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ వేడుక సందర్భంగా మెక్సికోలోని క్వెరెటా నగరం లో మొదటి రామమందిరాన్ని నిర్మించాం. అంతేకాదు ఇక్కడ మొదటి హనుమాన్ ఆలయం కూడా ఉందని ’’ భారత రాయబార కార్యాలయం తెలిపింది. దీనికి సంబంధించిన ఆలయం , వేడుకకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది.