మెక్సికోలో జరిగిన సదస్సుకు హాజరు
పద్మారావునగర్, వెలుగు: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ మెజీషియన్ సామల వేణు.. మెక్సికోలో జరిగిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీతల సదస్సులో పాల్గొన్నారు. ఇండియా తరఫున మొదటిసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న తొలి మెజీషియన్‌గా నిలిచారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ సమ్మిట్‌లో సామల వేణు తన ప్రదర్శనతో అందరి మన్ననలు పొందారు. తన 42 ఏండ్ల మెజీషియన్ ప్రస్థానంలో ఈ సమ్మిట్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందని సామల వేణు తెలిపారు.
నోబెల్ శాంతి బహుమతి గ్రహీతల మధ్య ప్రదర్శన ఇవ్వడం గొప్ప అనుభూతి ఇచ్చిందని చెప్పారు. కాగా, సామల వేణు ఇప్పటి వరకు 30కి పైగా దేశాల్లో ఏడు వేల ప్రదర్శనలు ఇచ్చి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్నారు. అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ మెజీషియన్స్ నుంచి రెండు సార్లు మెర్లిన్ అవార్డులు గెలుపొందారు.
2008లో హైదరాబాద్‌లో మెజీషియన్ అకాడమీని ఏర్పాటు చేశారు. మెక్సికోలో వేణు ప్రదర్శన ఇవ్వడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని మెజీషియన్స్ అకాడమీ సెక్రటరీ పూర్ణచందర్ అన్నారు.