MG కామెట్ EV: MG మోటార్స్ ఇండియా తన ఎంట్రీ లెవెల్ ఎలక్ట్రిక్ కారుపై భారీ తగ్గంపును ప్రకటించి ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో ప్రకంపనలు సృష్టించింది. కామెట్ ఈవీపై కంపెనీ రూ. 1.40 లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది. మార్కెట్లో టాటా మోటార్స్ టియాగో EV నుంచి పెరుగుతున్న పోటీని అధిగమించేందుకు, కామెట్ EV అమ్మకాలను పెంచడానికి ఒక వ్యూహం కావచ్చు. కంపెనీ తన బేస్ మోడల్పై రూ.99వేల తగ్గింపును ఇస్తోంది. ఈ ఆఫర్ తర్వాత కామెట్ EVని కొనుగోలు చేయడం ఇప్పుడు మరింత సరసమైనదిగా మారింది. కామెట్ EV కొత్త ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
MG కామెట్ EV పేస్, ప్లే, ప్లష్ అనే మూడు వేరియంట్ లలో విక్రయించబడుతోంది. వాటి కొత్త ధరలు రూ. 6.99 లక్షలు, రూ. 7.88 లక్షలు, రూ. 8.58 లక్షలు( ఎక్స్ - షోరూమ్). ఎంట్రీ లెవెల్ వేరియంట్ పేస్ ధర రూ. 99,000 తగ్గించారు. దీని ధర రూ. 7.98 లక్షలు నుంచి రూ. 6.99 లక్షలకు తగ్గింది. కామెత్ EV ..మిడ్ లెవెల్ ప్లే, టాప్ లెవెల్ ప్లష్ ధరలు రూ.1.40 లక్షలు తగ్గించారు. డిస్కౌంట్ తర్వాత ప్లే ధర రూ. 7.88 లక్షలు, ఫ్లస్ ధర రూ.8.58 లక్షలు. ఈ ధర వద్ద కామెట్ EV ఇప్పుడు దేశం లో చౌకైన ఎలక్ట్రిక్ కారుగా మారింది. కాగా Tiago EV ధర రూ. 8.69 లక్షలు నుంచి ప్రారంభమవుతుంది.
కామెత్ EV అనేది చైనా వులింగ్ EV ఆధారిత ఎలక్ట్రిక్ కారు. ఇది అధునాతన ఫీచర్లు, అద్భుతమై రేంజ్ తో వస్తోంది. కామెత్ EV 17.3 kWh బ్యాటరీ ప్యాక్ తో అమర్చబడింది. ఇది ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 230 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. దీనిలో రియర్ యాక్సిల్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారు ను ఉపయోగించారు. ఇది 42 bhp గరిష్ట శక్తిని, 110 KM టార్క్ ను అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు సిస్టమ్ 3.3kW AC ఛార్జింగ్ కు మద్దతునిస్తుంది. ఇది బ్యాటరీని ఫుల్ ఛార్జింగ్ చేయడానికి 7 గంటల సమయం పడుతుంది. ఈ కారు నెల రోజుల మెయింటెనెన్స్ కేవలం రూ. 500 మాత్రమే అని కంపెనీ చెపుతోంది.
MG కామెత్ EV ఫీచర్లు :
MG మోటార్స్ ఇండియా నుంచి వచ్చిన ఈ ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కారు సిటీ ట్రాఫిక్ లో నడపడానికి కాంపాక్ట్ గా రూపొందించబడింది. నలుగురు కూర్చునే స్థలాన్ని కలిగి ఉంటుంది. కారు పొడవు 3 మీటర్ల కంటే తక్కువ టర్నింగ్ వ్యాసార్థం 4.2 మీటర్లు మాత్రమే. 10.25 అంగుళాల స్క్రీన్ సెటప్, మాన్యువల్ AC, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, నావిగేషన్ కోసం కనెక్ట్ చేయబడిన కారు టెక్నాలజీ కూడా ఉన్నాయి. భద్రతా పరంగా చూస్తే ఈ కారులో డ్యుయెల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాంగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, డైనమిక్ గైడ్ లైన్స్ తో కూడిన రియర్ పార్కింగ్ కెమెరా, వెనుక పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కంపెనీ దీనిని నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో అందిస్తోంది. కామెత్ EV భారత మార్కెట్లో టాటా టియాగో EV తో పోటీపడుతోంది.