
ఎంజీ ఎలక్ట్రిక్ కార్ కామెట్ బ్లాక్స్మార్ట్ ఎడిషన్ జేఎస్‌డబ్ల్యూ మోటార్ ఇండియా ద్వారా హైదరాబాద్‌లో మంగళవారం విడుదలయింది. దీని ధర రూ.ఐదు లక్షల నుంచి మొదలవుతుంది. బ్యాటరీ రెంట్ కిలోమీటర్‌కు రూ.2.50 ఉంటుంది.
దీనిలోని17.4 కిలోవాట్అవర్ బ్యాటరీని ఒక్కసారి చార్జ్‌చేస్తే 230 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, నాలుగు స్పీకర్ల సౌండ్ సిస్టమ్ వంటి ప్రత్యేకతలు దీని సొంతం.