MG కొత్త ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ 430 కి.మీలు ప్రయాణించొచ్చు

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ MG ..రెండు కొత్త మోడల్ కార్లను భారత్ మార్కెట్ లో అమ్మకాలకు సిద్ధమవుతోంది.. త్వరలో లాంచ్ కానున్న MG సైబర్‌స్టర్ EV,   MG M9 లగ్జరీ ఎలక్ట్రిక్ MPV రెండు మోడళ్లను ఆటో ఎక్స్ పో 2025 లో ప్రదర్శనకు పెట్టింది. త్వరలో బుకింగ్‌ల కోసం తెరవబడతాయి , MG సెలెక్ట్  డీలర్‌షిప్‌ల ద్వారా అమ్మకాలు జరుగుతాయి. ఈ రెండు కార్ల కోసం ప్రీ-బుకింగులను ఇప్పటికే కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ప్రారంభమయ్యాయి. 

MG కంపెనీ.. SAIC మోటార్ ప్రపంచంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థల్లో ఒకటి. ప్రస్తుతం ఏడు MG కార్ల మోడల్స్  భారతదేశంలో అమ్ముతున్నారు. వీటిలో MG హెక్టర్, MG హెక్టర్ ప్లస్, MG విండ్సర్ EV, MG ఆస్టర్  గ్లోస్టర్, కామెట్ EV, ZS EV  వంటి కార్లు ఉన్నాయి.  MG సైబర్‌స్టర్, M9 మోడల్స్ తో ఎలక్ట్రిక్ కార్లపై ఆఫర్లను పెంచుతోంది. ప్రత్యేకించి లగ్జరీ విభాగంలోకి కొత్తదనాన్ని అందిస్తోంది. 

భారత్ లో M9 మోడల్ ప్రత్యేకంగా 90kWh బ్యాటరీ ప్యాక్‌తో ఆల్-ఎలక్ట్రిక్ ఫార్మాట్‌లోఅందిస్తోంది. MG M9 మోడల్ ఎలక్ట్రిక్ కారులో 6, 7-సీట్ల ఆప్షన్లు ఉన్నాయి. ఈ మోడల్ ఇండియాలో అత్యంత పొడవైన ఎలక్ట్రిక్ MPVగా రోడ్లపై మంచి లుక్ ను అందిస్తుంది. 

Also Read  :  నారాయణమూర్తి ఫ్యామిలీకి రూ .1,850 కోట్ల నష్టం.. కారణం ఇదేనా

ఇంటిరీయల్ డిజైన్ గురించి  మాట్లాడితే..12-స్పీకర్ సౌండ్ సిస్టమ్, స్టోరేజ్ స్పేస్‌లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ ఇంటీరియర్ హైలైట్‌గా ఉన్నాయి. సెక్యూరిటీ పరం గా చూస్తే..MG M9 లో సేఫ్టీ ఎక్విప్ మెంట్లు బాగున్నాయి. వీటిలో మొత్తం 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరాతో ఫ్రంట్, బ్యాక్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.

ఎక్స్ టర్నల్ డిజైన్ హైలైట్‌లలో ట్రాపెజోయిడల్ ఎయిర్ వెంట్‌లతో కూడిన క్లోజ్డ్-ఆఫ్ ఫ్రంట్ గ్రిల్, నిటారుగా LED హెడ్‌ల్యాంప్‌లు , కనెక్ట్ చేయబడిన లైట్ బార్‌తో కొత్త లుక్ డిజైన్‌లో LED DRLలు ఉన్నాయి. ఇది సైబర్‌స్టర్, క్రోమ్ యాక్సెంట్‌లు , 19-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై కనిపించే విధంగా స్లైడింగ్ సిజర్ డోర్లు కూడా ఉన్నాయి. 

సిల్వర్ బాడీ సైడ్ క్లాడింగ్‌తో పాటు విండోస్‌పై సిల్వర్ యాక్సెంట్లు ఉన్నాయి. ఇవి ప్రీమియమ్ లుక్ ను జోడిస్తాయి. అయితే వెనుక వైపు కనెక్ట్ చేయబడిన LED టెయిల్ ల్యాంప్‌లు క్రోమ్-ఫినిష్డ్ రియర్ బంపర్ యాక్సెంట్‌తో కనిపిస్తాయి. ఈ రెండు మోడళ్లలో లోపల  డ్రైవర్, ప్రయాణీకులకు మరింత లగ్జరీ క్యాబిన్ సౌకర్యాలను అందిస్తాయి.
కొత్త MG M9 లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ , ఫార్వర్డ్ కొలిజన్ అవాయిడెన్స్ వంటి  లెవల్-2 లేటెస్ట్ డ్రైవర్ హెల్పింగ్ సిస్టమ్ (ADAS) ఉంటుంది.

ఛార్జింగ్ కెపాసిటీ, ప్రయాణం 

కొత్త MG EV మోడల్ MG M9లో 90 kWh శక్తితో బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒక్కసారిగా ఛార్జింగ్ చేస్తే 430 కిమీలు ప్రయాణించొచ్చని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. దీనిలో 244 HP Power, 350 nm టార్క్ అందించే సింగిల్ ఎలక్ట్రిక్ మోటారు ఉంటుంది. ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ రైలుతో వస్తుంది. 125 kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌తో 30 నిమిషాల్లో 30నుంచి -80శాతంఛార్జ్ అవుతుంది. 

MG M9 కొత్త మోడల్ ఎలక్ట్రిక్ కారు.. కియా కార్నివాల్‌,టయోటా వెల్‌ఫైర్ , లెక్సస్ LM లకు  గట్టి పోటీదారు అని చెప్పొచ్చు. ధరలు ప్రకటించనప్పటికీ, అంచనా ధర దాదాపు రూ. 65 లక్షలు (ఎక్స్-షోరూమ్) .

MG M9, MG సైబర్‌స్టర్ EV.. ఈ రెండు మోడల్స్ ఇండియాలో మార్చి 2025లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.  ప్రీ-బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.