వీడియో: ఇద్దరు నర్సులకు కరోనా.. పట్టించుకోని వరంగల్ ఎంజీఎం

నిన్నటి వరకు కరోనా పేషంట్లకు సేవ..
నేడు వారికి కరోనా సోకడంతో పట్టించుకోని సిబ్బంది

నిన్నటి వరకు కరోనా పేషంట్లకు సేవ చేసిన నర్సులకు కరోనా సోకడంతో వాళ్లను కూడా వైద్యులు సరిగా పట్టించుకోని ఘటన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో జరిగింది. ఎంజీఎంలో పనిచేస్తున్న ఇద్దరు సాఫ్ట్ నర్సులకు కరోనా సోకింది. వారి నుంచి వారి కటుంబసభ్యులకు కూడా కరోనా సోకింది. వీరంతా ఆస్పత్రిలో స్పెషల్ రూముల్లో ఉండటంతో.. గది ఖాళీ చేయాలని డాక్టర్లు ఒత్తిడి తెచ్చారు. దాంతో సాఫ్ట్ నర్సులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తమ బాధనంతా సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఆ వీడియో కలకలం సృష్టించింది.

కరోనా పాజిటివ్​ వచ్చిన తమ పట్ల వైద్యులు కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారని వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే ఆస్పత్రిలో నిన్నటివరకు కరోనా వార్డులో డ్యూటీ చేసిన తమను గది ఖాళీ చేయాలంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. కోవిడ్​ వార్డులో సరైన ఫెసిలిటీస్​ లేవంటూ కరోనా సోకిన స్టాఫ్​ నర్సులు అంటున్నారు.​ అర్ధరాత్రి డాక్టర్లు వచ్చి తమను రూం ఖాళీ చేయమని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని సాఫ్ట్ నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ప్రాణాలకు తెగించి కోవిడ్​ వార్డులో డ్యూటీ చేయడం వల్లే ఈ వైరస్​ బారిన పడ్డామని.. తమతో పాటు తమ కుటుంబ సభ్యులు కూడా సఫర్​ అవుతున్నారని స్టాఫ్​ నర్సులు పేర్కొన్నారు. అర్ధరాత్రి తమను ఖాళీ చేసి వెళ్లమని ఇబ్బందులు పెడితే తమ పరిస్థితి ఏంటని వాపోయారు. తాము స్పెషల్ రూముల్లో ఉంటే ట్రీట్​మెంట్​ చేయలేమంటూ డాక్టర్లు పీపీఈ కిట్లు వదిలేసి వెళ్లిపోయారని తెలిపారు. తమను అక్కడి నుంచి ఐసోలేషన్​ వార్డుకు వెళ్లమని వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. ఐసోలేషన్​ వార్డులో సరైన బెడ్స్​, టాయిలెట్స్​, ఇతర ఫెసిలిటీస్​ ఏమీ లేవని ఇద్దరు నర్సులు ఆవేదన చెందారు. వైద్యశాఖలోనే పని చేస్తున్న తమకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా అని ప్రశ్నించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.

For More News..

దిల్ సుఖ్ నగర్ సెల్ఫ్ లాక్ డౌన్

వీడియో: పదేళ్ల క్రితం.. ప్రస్తుతం సూర్యుడు ఎలా ఉన్నాడంటే..

మాస్క్ వేసుకోనందుకు ఆర్డర్ తీసుకోని వెయిటర్.. టిప్ గా రూ. 33 లక్షలు