500 రూపాయల నోట్లు మీ దగ్గర ఉన్నాయా.. ఉంటాయి.. ఉండే ఉంటాయి. అయితే ఇప్పుడు మీరు ఓ పని అర్జంట్ గా చేయాలి. మీ దగ్గర ఉన్న 500 రూపాయల నోట్లను చెక్ చేసుకోండి.. అవి ఒరిజినల్ నోట్లా లేక దొంగ నోట్లా అని.. ఎందుకు అంటే.. మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే నకిలీ నోట్ల విషయంలో అప్రమత్తం చేసింది. మార్కెట్ లో నకిలీ.. ఫేక్.. దొంగ 500 నోట్లు చెలామణిలో ఉండొచ్చు అని.. ఇటీవల కాలంలో ఎక్కువగా సంఖ్యలో దొంగ నోట్లు చెలామణిలోకి వచ్చి ఉండొచ్చు అంటూ దర్యాప్తు సంస్థలను సైతం హచ్చరిస్తూ ఆర్బీఐ అప్రమత్తం చేయటం విశేషం.
ఫేక్ నోట్లతో సామాన్యులను బురిడీ కొట్టిస్తున్నారు కేటుగాళ్లు. భారీగా చలామనిలోకి వచ్చినట్లు కేంద్రం గుర్తించింది. నకిలీ, ఒరిజినల్ నోట్లను గుర్తించడం కష్టంగా మారిందన్న కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. నకిలీ 500 నోట్ల విషయంలో ప్రజలను అప్రమ్తం చేసింది. నకిలీ నోట్లు అత్యంత నాణ్యంగా ఉన్నాయని, గుర్తించడం కష్టంగా మారిందని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పేర్కొంది. నోట్లను తీసుకునే ముందు క్షుణ్నంగా పరిశీలించి తీసుకోవాలని సూచించింది. నకిలీ నోట్ల చలామని విషయంలో డీఆర్ఐ, సీబీఐ, ఎన్ఐఏ, సెబీ, ఎఫ్ఐయూ లను అప్రమత్తం చేసింది.
Also Read:-మత్తు కోసం ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లు ఒకేసారి తీసుకున్న ఇంటర్ విద్యార్థులు.. ఒకరు మృతి
నకిలీ నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇం డియాలోని రిజర్వ్ అనే చోట 'E' అక్షరం బదులు 'A' ముద్రించారని పేర్కొంది. ఈ చిన్న ట్రిక్ తో అసలు, నకిలీ నోట్ల మధ్య తేడాలు గుర్తించవచ్చునని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనిని జా గ్రత్తగా పరిశీలిస్తే తప్ప రూ.500 నోటు అసలుదా, నకిలీదా అని గుర్తించలేమని తెలిపింది. విషయంపై బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల ను అప్రమత్తం చేశామని తెలిపిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ
ఈ విషయంలో ప్రజలు కూడా ఈ తప్పును గుర్తించలేరని వెల్లడించింది. జాగ్రత్తగా ఉండాలని, ప్రజలలో అవగాహన కల్పించాలని బ్యాంకులను, ఇతర సంస్థలను ఆదేశించింది.
ఎలా గుర్తించాలి:
ఫేక్ నోట్ల విషయంలో ఒరిజినల్ ఏదో, ఫేక్ ఏదో గుర్తించలేని స్థితి ఏర్పడింది. దేశ వ్యాప్తంగా డిజిటల్ కరెన్సీకి అలవాటు పడిన జనం చేతుల్లో ఫిజికల్ కరెన్సీ చలామణి తగ్గిపోయింది. ఒకప్పుడు నోట్లను చేతులతో లెక్కపెట్టే వారు. ఎంత డబ్బు కావాలన్నా ఫిజికల్ గానే వాడేవారు. దీంతో ఎల్లప్పుడూ క్యాష్ ను లెక్కపెడుతూ ఉండటంతో జనాలకు క్యాష్ స్పర్ష ఈజీగా తెలిసేది. దీంతో ఫేక ఏదో.. ఒరిజినల్ ఏదో ఈజీగా అర్థమయ్యేది. చాలా మంది లెక్కపెడుతూనే తేడా అనిపిస్తే ఆ నోటును పక్కకు తీసేవారు. కానీ డిజిటల్ మనీ అలవాటు అయ్యాక క్యాష్ లెక్కించడం తగ్గిపోయింది. ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్, ఫోన్ పే, గూగుల్ పే లాంటి యాప్స్ ద్వార డిజిటల్ వినియోగం పెరిగిపోయింది. దీంతో ఇప్పుడు క్యాష్ ను ఎక్కువగా ముట్టుకునే పరిస్థితే లేకుండా పోయింది. ఇక ఫేక్ మనీని గుర్తించడం కష్టంగానే మారిపోయింది. ఈ టైమ్ లో ఫేక్ నోట్లను గుర్తించడం ఎలాగో ఆర్బీఐ సూచనలు ఇచ్చింది.