రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో 2,050 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్‌నర్సు) పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులు సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది.
అర్హతలు: జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) లేదా బీఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో వివరాల నమోదు చేసుకొని ఉండాలి. వయసు 18 నుంచి 46 సంవత్సరాల మధ్య ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: రాతపరీక్షకు 80 పాయింట్లు ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసుకు 20 పాయింట్ల వెయిటేజీ ఉంటుంది.
రాత పరీక్ష: నవంబరు 23న నర్సింగ్ ఆఫీసర్ల ఎంపికకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు.
రాతపరీక్షకు 80 పాయింట్లు ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసుకు 20 పాయింట్ల వెయిటేజీ ఉంటుంది
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ర్తి వివరాలకు www.mhsrb.telangana.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.