సౌతాఫ్రికా వేదికగా జరగనున్న 20 లీగ్ రెండో సీజన్‌కు MI కేప్ టౌన్ జట్టుకు కీరన్ పొలార్డ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. తొలి సీజన్ లో కెప్టెన్ గా వ్యవహరించిన రషీద్ ఖాన్ ఇటీవలే వెన్ను గాయంతో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం పూర్తిగా కోలుకొని ఈ స్టార్ ప్లేయర్..సౌతాఫ్రికా 20 లీగ్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు. దీంతో రషీద్ ఖాన్ స్థానంలో పొలార్డ్ ను కెప్టెన్ గా నియమించారు.
రషీద్ ఖాన్ సారధ్యంలోని తొలి సీజన్ లో MI కేప్ టౌన్ దారుణమైన ఆట తీరుతో నిరాశపరిచింది. 10 మ్యాచ్ ల్లో మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. రాబిన్ పీటర్సన్ MI కేప్ టౌన్ హెడ్ కోచ్‌గా ఉంటాడు. లసిత్ మలింగ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తాడు. జనవరి 10 నుంచి ఈ మెగా లీగ్ ప్రారంభం కానుండగా.. MI కేప్ టౌన్ జనవరి 11 న డర్బన్ లో సూపర్ జెయింట్స్‌తో తొలి మ్యాచ్ లో తలపడనుంది.
MI స్క్వాడ్‌లో శామ్ కుర్రాన్, ఆలీ స్టోన్, లియామ్ లివింగ్‌స్టోన్, టామ్ బాంటన్ వంటి వరల్డ్ క్లాస్ ఇంగ్లాండ్ బ్యాటర్లున్నారు. వేలంలో వైల్డ్ కార్డు ద్వారా.. క్రిస్ బెంజమిన్‌ను తీసుకుంది. కగిసో రబడా, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్, జార్జ్ లిండే, బ్యూరాన్ హెండ్రిక్స్, డెవాల్డ్ బ్రెవిస్, ర్యాన్ రికిల్టన్ ఉన్నారు లాంటి స్టార్ ఆటగాళ్లు ముంబై జట్టులో ఉన్నారు.
Kieron Pollard will lead MI Cape Town at the SA20, with Rashid Khan still recovering following a back surgery. Nicholas Pooran will captain MI Emirates in the ILT20 pic.twitter.com/TjNTYe1QpV
— ESPNcricinfo (@ESPNcricinfo) January 7, 2024
MI కేప్ టౌన్ స్క్వాడ్:
డెవాల్డ్ బ్రీవిస్, కగిసో రబడా, సామ్ కుర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్, టామ్ బాంటన్, రాస్సీ వాన్ డెర్ డుస్సెన్, ర్యాన్ రికెల్టన్, జార్జ్ లిండే, బ్యూరాన్ హెండ్రిక్స్, డువాన్ జాన్సెన్, ఒల్లీ స్టోన్, గ్రాంట్ రోలోఫ్‌సెన్, డెలానో బెంజినెమిన్, ఛ్రిస్యామిన్ వాన్ హీర్డెన్, థామస్ కబెర్, కానర్ ఎస్టర్‌హుజెన్, కీరన్ పొలార్డ్, జోఫ్రా ఆర్చర్