ముంబై ఇండియన్స్ ఖాతాలో మరో టైటిల్..సప్తసముద్రాల అవతల కూడా మనదే పైచేయి

ముంబై ఇండియన్స్ ఖాతాలో మరో టైటిల్..సప్తసముద్రాల అవతల కూడా మనదే పైచేయి

అగ్రరాజ్యం అమెరికా వేదికగా జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ 2023 తొలి ఎడిషన్ విజేతగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఎంఐ న్యూయార్క్ నిలిచింది. డల్లాస్ వేదికగా సోమవారం (ఆగస్ట్ 1) సిటెల్ ఓర్కాస్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ముంబై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన సీటెల్ ఓర్కాస్ నిర్ణీత 20 ఓవర్లలో 183 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ 87(52 బంతుల్లో; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. ముంబై బౌలర్లలో మిస్టరీ విన్నర్ రషీద్ ఖాన్ 4 ఓవర్లలో 9 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టగా.. ట్రెంట్ బోల్ట్ 3 వికెట్లు తీసుకున్నాడు.

అనంతరం 184 పరుగుల భారీ టార్గెట్ చేధనకు దిగిన ఎంఐ న్యూయార్క్ కేవలం 3 వికెట్లు మాత్రమే అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. ఆ జట్టు కెప్టెన్, విండీస్ విధ్వంసకర క్రికెటర్ నికోలస్ పూరాన్.. ఓర్కాస్ బౌలర్లపై విహారం చేశాడు. 

55 బంతుల్లో 10 ఫోర్లు 13 సిక్సర్లతో మెరుపు సెంచరీ చేసిన పూరాన్.. ముంబై జట్టుకు ఒంటి చేత్తో టైటిల్ అందించాడు. పూరాన్ దాటికి ముంబై మరో 24 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది.