
చైనాకు చెందిన మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ షావోమీ త్వరలో ‘108 ఎంపీ కెమెరా’తో స్మార్ట్‌ఫోన్ విడుదల చేయనుంది. ‘ఎంఐ నోట్ 10’ పేరుతో ఈ ఫోన్ విడుదల కానున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే 48ఎంపీ, 64 ఎంపీ కెమెరా ఫోన్లను షావోమీ మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. చైనాలో 108 ఎంపీ కెమెరా ఫోన్‌ను ‘ఎంఐ సీసీ9 ప్రొ’ పేరుతో విడుదల చేస్తుండగా, మిగతా చోట్ల మాత్రం ‘ఎంఐ నోట్ 10’ పేరుతో విడుదల చేయబోతుంది. దీన్ని ఐదు రేర్ కెమెరాలతో (పెంటా కెమెరా సెటప్)తో తయారు చేస్తున్నారు. ఇందులో 20 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరాతోపాటు పోట్రెయిట్ షాట్స్ కోసం 12 ఎంపీ కెమెరాను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ‘సాంసంగ్ ఐసోసెల్ సెన్సర్’ ద్వారా 108 కెమెరా పని చేస్తుంది. ఈ ఫోన్ వచ్చే నెల ఐదున చైనా మార్కెట్లో విడుదలవుతుంది. ఆ తర్వాత మన దేశంతోపాటు ఇతర దేశాల్లోనూ అందుబాటులోకి వస్తుంది. అయితే మన దగ్గర ఎప్పుడు విడుదలయ్యేది కంపెనీ ఇంకా ప్రకటించలేదు. షావోమీతోపాటు త్వరలోనే చైనాకు చెందిన ‘రియల్ మి’, ‘సాంసంగ్’ సంస్థలు కూడా 108 ఎంపీ కెమెరా ఫోన్‌ను రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నాయి.